Nellore: చేనేత కళాకారుల కుటుంబాలకు మరియు పవర్-లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ హామీ నిలబెట్టుకొనే క్రమంలో ప్రభుత్వం తగు విధములైన చర్యలు తీసుకోవడం జరిగింది.
ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఏప్రిల్ 1, 2026 నుంచి అర్హులైన చేనేత కళాకారుల కుటుంబాలకు 200 యూనిట్ల మేర మరియు పవర్-లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల మేర ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు ఇచ్చి ఉండటం విదితమే.
ఈ పథకం అమలుకు చేనేత మరియు జౌళి శాఖ, ఆంధ్రప్రదేశ్ మరియు ఎనర్జీ డిపార్ట్మెంట్ ల సమన్వయంతో నేటివరకు సుమారు (50252) చేనేత కళాకారుల కుటుంబాలకు మరియు (6995) పవర్ లూమ్ యూనిట్లను అధికారికంగా గుర్తించి వారికి ఈ పధకం అమలును తొలి నెలలోనే సున్నా విద్యుత్ బిల్లులు పొందుటకు చర్యలు తీసుకోవడం జరిగినది. దీని ద్వారా నెలకు సుమారు రూ.720/- మరియు సంవత్సరానికి రూ.8,640/- వరకు చేనేత కళాకారుల కుటుంబాలకు మరియు రూ.1,800/- మరియు రూ.21,600/- వరకు పవర్ లూమ్ యూనిట్లకు లబ్ది చేకూరుతుంది అదే విధంగా శ్రీ పోట్టి శ్రీరాములు జిల్లాలో 2,969 మంది చే నేత కుటుంబాలు మరియు 5 పవర్ లూమ్ యూనిట్లు కలిగిన కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు నోచుకోవడం చేనేత కళాకారులు మరియు పవర్ లూమ్ యూనిట్ల వారు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు తెలుపుతూ హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు.

