Nellore: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు బక్రీద్ తోఫా పంపిణీ
నెల్లూరు: నగర పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని, నిత్యం నగరాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచే ఫ్రంట్ వారియర్స్ పారిశుధ్య కార్మికులేనని గుర్తు చేశారు షేక్ బాషా.
ఈ సందర్భంగా బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని, బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ సౌభాతృత్వంలకు ప్రతీక అని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ భారత్ ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం మైనార్టీ చైర్మన్, మాజీ మూడవ మున్సిపల్ డివిజన్ చైర్మన్ షేక్ బాషా అన్నారు.
గత 25 సంవత్సరాలుగా రంజాన్, బక్రీద్ పండుగలకు పారిశుద్ధ్య మున్సిపల్ సిబ్బందికి తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు తోఫా పంపిణీ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా షేక్ బాషా ప్రజలందరికీ త్యాగం, ప్రేమ, సౌభాతృత్వం ప్రతీక బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

