నెల్లూరు: చట్టానికి ఎవరో చుట్టాలు కాదని చట్టం తన పని తాను చేసుకు పోతుందని చెప్పారు నగర కమిషనర్ వై. ఓ నందన్. నగర పారిశుద్ధ్య పనులలోను, డ్రైన్స్, చెట్లు నాటడం విషయంలోనూ, మరియు ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించిన ఆక్రమణలను తొలగించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరో మరి పునరుద్ఘాటించారు నగర కమిషనర్.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి స్థానిక 5వ డివిజన్ బోడిగాడి తోట ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. రోడ్డు వెంబడి ఉన్న ఇండ్ల ఆక్రమణలను పరిశీలించి అధికారులకు వివిధ సూచనలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం ఈ.ఈ అనిల్ కుమార్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథ రావు, సర్వేయర్ ఏడుకొండలు, వార్డు సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

