Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: నెల్లూరు మత్స్యకార సొసైటీ అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు!

Nellore: నెల్లూరు మత్స్యకార సొసైటీ అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు!

hmtv 1 week ago

Nellore: నెల్లూరు మత్స్యకార సొసైటీ అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు!

నెల్లూరు: నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం పిడూరు & లక్ష్మీనరసింహపురం మత్స్యకార సొసైటీల పరిధిలో...

నిబంధనలకు విరుద్ధంగా సభ్యులకు తెలియకుండా వేలం పాట నిర్వహించి, మత్స్య సంపదను దోచుకొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఈరోజు గ్రీవెన్స్ లో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమన్షు శుక్లాకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్బంగా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య మాట్లాడుతూ...

పైన పేర్కొన్న సొసైటీల పరిధిలో సొసైటీ సభ్యులు మాత్రమే చేపలు పట్టుకొని జీవనం సాగించాలని, కానీ కొంతమంది సభ్యులకు తెలియకుండా వేలం పాటలు నిర్వహించి యానాదులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు... ఇదేమని ప్రశ్నించిన సభ్యులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు...

యానాదులకు ఇంత అన్యాయం జరుగుతున్నా మత్స్యశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయవలసినదిగా కోరారు. లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రమేష్ మరియు సొసైటీ సెక్రటరీ గడ్డం ఓబయ్య, డైరెక్టర్ అద్దూరు రమణయ్య, సభ్యులు గడ్డం కృష్ణయ్య,మొలకల పోలయ్య,మొలకల చిన్న సుబ్బయ్య,కోవూరు చంద్రయ్య,యువనాయకులు సెనగల శ్రీనివాసులు, మొలకల బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu