నెల్లూరు: జిల్లా పోలీసు సిబ్బందికి యోగా మరియు ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహణ, మానసిక ప్రశాంతత - శారీరక దృఢత్వమే లక్ష్యం అన్నారు జిల్లా ఎస్పీ డా.
అజిత వేజెండ్ల. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఈ రోజు అనగా తేది 22.05.2026న SPSR నెల్లూరు జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్ మైదానంలో జిల్లా పోలీసు సిబ్బందికి ప్రత్యేక యోగా మరియు ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సహకారంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఎం.ఎల్ పరమేశ్వరరావు, సెంటర్ కోఆర్డినేటర్ కె.వి సత్యనారాయణ పోలీసు సిబ్బందిని ఉద్దేశించి యోగా మరియు ధ్యాన సాధన యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మానవ హృదయం తల్లి గర్భంలో తొలుత ఏర్పడే ప్రధాన అవయువం అని, అది కడ వరకు పనిచేసి మనిషిని సజీవంగా ఉంచేది కూడా మన గుండె అని, మనం ఈ కోర్స్ లో ధ్యానం అంతా హృదయం చుట్టూ పరిభ్రమణ చేసే విధంగా డిజైన్ కాబడినదని తెలిపారు.
అనంతరం వారు సిబ్బందితో కలిసి యోగా మరియు ధ్యాన సాధనలో పాల్గొన్నారు. పోలీసు విధుల్లో భాగంగా నిరంతరం ఒత్తిడి, మానసిక ఆందోళనలు ఎదుర్కొనే సిబ్బందికి యోగా మరియు ధ్యాన సాధన ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, శారీరక దృఢత్వం పెంపొందుతాయని, విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. అలాగే నిత్య జీవితంలో యోగా మరియు ధ్యానాన్ని భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్‌బీ డీఎస్పీ ధీరజ్ వినీల్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ, సీఐడీ డియస్పి కోటా రెడ్డి ఏసీబీ, మెరైన్ అధికారులు, నెల్లూరు త్రీ టౌన్ సీఐ, సైబర్ సీఐ , పీసీఆర్ సీఐ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అలాగే హార్ట్ ఫుల్ నెస్ సంస్థకు చెందిన సర్టిఫైడ్ ట్రైనర్స్ ఏ. ప్రసాద్, జి. శ్రీనివాస్ , శ్రీ సీబీఎన్ ప్రసాద్ , బీఎంఆర్ చైతన్య, ఎన్. కిషోర్ కుమార్ , రాజ్యలక్ష్మి , అన్నపూర్ణ, విజయలక్ష్మి, రాజేశ్వరి, యశోద, జయప్రద , శశికళ, భారతి మరియు 400 వందల మంది పోలీసు సిబ్బంది పాల్గొని ఉత్సాహంగా యోగా సాధన చేశారు. జిల్లా పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇటువంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తేదీ 23.05.26 మరియు 25.05.26 న కూడా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల తెలిపారు.

