Nellore: నేరస్తుల గుండెల్లో రైళ్లు: నిఘాను పెంచిన ఎస్పీ అజిత వెజెండ్ల!
Nellore: NDPS షీట్ మానిటరింగ్, సెక్సువల్ అఫెండర్ షీట్ మానిటరింగ్ మరియు స్మార్ట్ పోలీసింగ్ అంశాలపై జిల్లా ఎస్పీ డా.
అజిత వెజెండ్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేరాలు చేసి తప్పించుకోలేరని, ప్రతి నేరస్తుడిపై పోలీసుల నిఘా ఉంటుందని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు
ఈ రోజు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని SDPOలు, CIలు, SIలు మరియు ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ (Zoom Meeting) నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా NDPS షీట్ మానిటరింగ్, సెక్సువల్ అఫెండర్ షీట్ మానిటరింగ్ మరియు స్మార్ట్ పోలీసింగ్ అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి NDPS షీట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, షీటర్ల కదలికలు, పాత కేసుల స్థితి, బెయిల్‌పై విడుదలైన నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు చేపట్టాలని, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన అవసరాన్ని వివరించారు. NDPS కేసుల్లో నమోదైన నిందితుల కార్యకలాపాలపై నిరంతర ఫాలోఅప్ నిర్వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా సెక్సువల్ అఫెండర్ షీట్ మానిటరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సెక్సువల్ అఫెండర్ల కదలికలు, ప్రవర్తన, తిరిగి నేరాలకు పాల్పడే అవకాశాలపై నిరంతర నిఘా ఉంచి, అవసరమైన చోట కౌన్సెలింగ్ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాల నివారణలో ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
స్మార్ట్ పోలీసింగ్‌పై మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా CCTV వ్యవస్థలు, డ్రోన్ టెక్నాలజీ, CCTNS, e-Codes, TABS, e-Sakshya, CCTV-360 యాప్ వంటి సాంకేతిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించాలని తెలిపారు. మిస్సింగ్ కేసులు, ప్రాపర్టీ ఆఫెన్సులు, వాహనాల అన్వేషణ, నేరస్తుల గుర్తింపులో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ వారీగా KPIs (Key Performance Indicators) ఆధారంగా ప్రతి SHO పనితీరును సమీక్షిస్తూ, కేసుల దర్యాప్తు, స్పందన సమయం, నేర నియంత్రణ, ప్రజా సేవల అమలులో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే PPP (Public Private Partnership) విధానంలో ప్రజలు, ప్రైవేట్ సంస్థలు మరియు పోలీస్ శాఖ పరస్పర సహకారంతో CCTV వ్యవస్థల విస్తరణ, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధి మరియు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.
జిల్లాలో స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేసి, నేర నియంత్రణను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలను అందించాలని జిల్లా ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ Ch సౌజన్య, జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, CIలు, SIలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

