Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: నిన్న 50 డిగ్రీల ఎండ.. నేడు చల్లబడిన వాతావరణం

Nellore: నిన్న 50 డిగ్రీల ఎండ.. నేడు చల్లబడిన వాతావరణం

hmtv 2 days ago

నెల్లూరు: గత వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా పెరిగిన ఎండ తీవ్రతతో నగరవాసులు తల్లడిల్లిపోయారు. ముఖ్యంగా నిన్నటి రోజున పెరిగిన ఎండ తీవ్రత 50 డిగ్రీలకు చేరుకుందంటే...

వేసవి తాపం ఎండ తీవ్రత ఎంత ఉదృతస్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

నిన్న ఉదయం 10 గంటల నుంచే నగరంలో దాదాపుగా వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయనే చెప్పాలి... రహదారులన్నీ కర్ఫ్యూని తలపించాయి.... నిన్న ఒక్కరోజులోనే జిల్లా వ్యాప్తంగా పెరిగిన 50 డిగ్రీల ఎండ తీవ్రతతో, వడదెబ్బ తగిలి 20 మంది వృద్ధులు, మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. గత రాత్రి కూడా 36, 37 డిగ్రీల వేడి గాలులు విచాయంటే , ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు... సూర్య భగవానుడి దెబ్బకు విలవిల్లాడిపోయిన జనం, తెల్లారితే నిప్పులు కురిపిస్తూ వచ్చే సూర్యుడ్ని తలుచుకొని వణికిపోయారు.

కానీ నగరవాసుల అంచనాల్ని తలక్రిందులు చేస్తూ.... ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో నిండిపోయింది..... చల్లటి గాలులతో నగరవాసుల్ని మైమరిపించింది.... సూర్య భగవానుడు దాదాపుగా కంటికి కనిపించకపోవడంతో, నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.... బెత్తం దెబ్బలు తిన్నాక వెన్నుపూసతో చల్లబరిచినట్టు.... మొత్తానికి నగరవాసులు తమ రోజువారీ కార్యక్రమాల్లో హాయిగా మునిగిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu