Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: పెట్రోల్ డీజిల్ ధరలపై కదంతొక్కిన నెల్లూరు వైఎస్సార్‌సీపీ

Nellore: పెట్రోల్ డీజిల్ ధరలపై కదంతొక్కిన నెల్లూరు వైఎస్సార్‌సీపీ

hmtv 5 days ago

Nellore: పెట్రోల్ డీజిల్ ధరలపై కదంతొక్కిన నెల్లూరు వైఎస్సార్‌సీపీ

నెల్లూరు: నగరంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు కదం తొక్కాయి. రాష్ట్రంలో పెరుగుతున్న డీజిల్ ,పెట్రోల్ ధరలు, గ్యాస్ కొరత, విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ..

నెల్లూరు నగరంలో వైసిపి ఆందోళన చేపట్టింది. ఓల్డ్ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ లోని , తిక్కన ప్రాంగణం ప్రజా విజ్ఞప్తుల వేదిక వరకు పెద్ద సంఖ్యలో, వైసిపి నాయకులు, కార్యకర్తలు , నిరసన ప్రదర్శన నిర్వహించారు.. పెంచిన ధరలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నగర నియోజకవర్గం ఇంచార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర రెడ్డిల ఆధ్వర్యంలో , పలువురు కార్పొరేటర్లు..

వైఎస్ఆర్సిపి నాయకులు ధరల పెరుగుదలను ఆపాలంటూ విజ్ఞాపన పత్రాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వినూత్న ర్యాలీ నిర్వహించారు... పెట్రోల్ డీజిల్ కొలతలు అందుబాటులో లేనందుకు నిరసిస్తూ.. ఆయన సైకిల్ తొక్కుకుంటూ కలెక్టరేట్ కు చేరుకున్నారు... అనంతరం ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు... అన్ని విధాలా ధరలు తగ్గిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లు ఇప్పుడు అన్నింటా ధరలను పెంచి, ప్రజలను నడ్డి విరుస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu