Dailyhunt
Nellore: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ.. నెల్లూరులో ఆరోగ్య భరోసా జాతర

Nellore: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ.. నెల్లూరులో ఆరోగ్య భరోసా జాతర

hmtv 1 week ago

Nellore: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేళ.. నెల్లూరులో ఆరోగ్య భరోసా జాతర

Nellore: నెల్లూరు 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంత్రి నారాయణ చేపట్టిన 'ప్రతి గడపకు ఆరోగ్య భరోసా' కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా వైద్య బృందాలు మరియు నాయకులు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య అవగాహన కరపత్రాలను పంపిణీ చేయగా, అనంతరం నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 2,986 మందికి కంటి పరీక్షలు, 1,556 మందికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ, 45 మందికి అత్యంత ఖరీదైన కంటి శస్త్రచికిత్సలు మరియు 1,600 మందికి పైగా దంత చికిత్సలను పూర్తి ఉచితంగా అందించారు.

ఈ సందర్భంగా నాయకులు మరియు వైద్యులు మాట్లాడుతూ..

కేవలం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడే కాకుండా, నెల్లూరు నగరంలోని ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా చేరువ చేయడమే లక్ష్యంగా మంత్రి నారాయణ ఈ నిరంతర కార్యక్రమాన్ని చేపట్టారని, అందుకే ఆయన ప్రజల పాలిట 'ఆపద్బాంధవుడు' అయ్యారని కొనియాడారు. సామాన్యుల ఆరోగ్యం కోసం నిరంతరాయంగా సాగుతున్న ఈ ఆరోగ్య విప్లవం నగరంలోని అన్ని డివిజన్లలో కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ ,ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుధ,వైద్య పరిపాలన పర్యవేక్షకులు A.G.M. శేఖర్ రెడ్డి, నాయకులు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ -కో ఆప్షన్ మెంబెర్ షేక్. జమీర్,ప్రెసిడెంట్- షాహిద్

కార్పొరేటర్ సఫియా ముజీర్,పార్లమెంట్ మైనారిటీ అధికార ప్రతినిధి షేక్ జంషీద్, యూనిట్ ఇంచార్జి -ఖాదర్ బాషా,కో-యూనిట్ ఇంచార్జి- మునీర్,యూత్ ప్రెసిడెంట్ ముస్టాక్,బూత్ కన్వీనర్- హసీబ్, అస్లాం బూత్ లెవెల్ అసిస్టెంట్ ఇస్మాయిల్, ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దంతం రవణమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ- ఖాదర్ భాష,డివిజన్ యూత్ ప్రెసిడెంట్- ఖలీల్ డివిజన్ యూత్ -జనరల్ సెక్రటరీ - ఫైజు, ప్రభావితులు-మక్కే. శివప్రసాద్,సుభాని తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu