Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: టీడీపీ మహానాడుకు బ్రేక్.. అధిష్టానం సంచలన నిర్ణయం!

Nellore: టీడీపీ మహానాడుకు బ్రేక్.. అధిష్టానం సంచలన నిర్ణయం!

hmtv 1 week ago

Nellore: టీడీపీ మహానాడుకు బ్రేక్.. అధిష్టానం సంచలన నిర్ణయం!

Nellore: కోవూరు నియోజకవర్గంలో జరగనున్న టిడిపి మహానాడు బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడు పై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

నెల్లూరులో మూడు రోజుల మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27,28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ విధానంలో నిర్వహణకు నిర్ణయం తీసుకుంటామన్నారు. హైబ్రిడ్ విధానంలో 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గా, జిల్లాల నుంచి వర్చ్యువల్ గా మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపిలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మహానాడు కు ఆన్ లైన్ లో ఆయా క్లష్టర్ల నుంచి హాజరయ్యేలా ఏర్పాట్లు తీసుకున్నారు. తీర్మానాలు సహా ఇతర అన్ని అంశాల్లోను మహానాడు విధానాలనే పాటిస్తూ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహణకు సిద్ధమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu