నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరు,కొండాపురం,కలిగిరి మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపగా, అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు విరిగి రహదారులపై పడటంతో వాహనదారులకు స్వల్ప ఇబ్బందులు ఏర్పడ్డాయి.
గత రెండు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కురిసిన వర్షం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

