Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nirmal: "ధరలు తగ్గించే వరకు వదిలేది లేదు".. నిర్మల్‌లో సీపీఐ ఎంఎల్ ఆందోళన!

Nirmal: "ధరలు తగ్గించే వరకు వదిలేది లేదు".. నిర్మల్‌లో సీపీఐ ఎంఎల్ ఆందోళన!

hmtv 2 weeks ago

Nirmal: "ధరలు తగ్గించే వరకు వదిలేది లేదు".. నిర్మల్‌లో సీపీఐ ఎంఎల్ ఆందోళన!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట గల జాతీయ రహదారిపై సిపిఐ (ఎంఎల్) ప్రజాపంతా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాసు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెంచిన ధరలతో సామాన్య ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపుపై దృష్టి సారించాలన్నారు. అలాగే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu