Dailyhunt
Nirmal: కనుగుట్ట బాధిత రైతులకు కల్వకుంట్ల కవిత పరామర్శ

Nirmal: కనుగుట్ట బాధిత రైతులకు కల్వకుంట్ల కవిత పరామర్శ

hmtv 5 days ago

Nirmal: కనుగుట్ట బాధిత రైతులకు కల్వకుంట్ల కవిత పరామర్శ

Nirmal: బోథ్ కన్గుట్ట అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులను తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు.

పార్టీ నియోజకవర్గ నాయకురాలు మౌనిక రాథోడ్ ఘటనా స్థలాన్ని సందర్శించి, విలపిస్తున్న మహిళా రైతులతో కవితక్కను మాట్లాడించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నష్టపరిహారం విషయంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ​మౌనిక రాథోడ్ మాట్లాడుతూ.. దాదాపు 80 ఎకరాల్లో పంట కాలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం,

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బోథ్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్లే నష్ట తీవ్రత పెరిగిందని ఆమె విమర్శించారు. బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని, లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమని ఆమె మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu