Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nirmal: ఖానాపూర్‌లో గంజాయి కలకలం.. బీహార్ నిందితుడి అరెస్ట్

Nirmal: ఖానాపూర్‌లో గంజాయి కలకలం.. బీహార్ నిందితుడి అరెస్ట్

hmtv 4 days ago

Nirmal: ఖానాపూర్‌లో గంజాయి కలకలం.. బీహార్ నిందితుడి అరెస్ట్

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రామరెడ్డిపల్లి బస్ స్టాప్ సమీపంలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు గంజాయి విక్రయిస్తున్న మనీష్ పాస్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుండి ఒక కిలో గంజాయి,ఒక రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బీహార్ నుండి గంజాయి తీసుకువచ్చి ఖానాపూర్ ప్రాంతంలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ దాడిని, స్వాధీనం, విచారణ ప్రక్రియ మొత్తం కూడా ఈ-సాక్ష్య యాప్ ద్వారా వీడియో చిత్రీకరణ చేయడం జరిగిందని. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మాదకద్రవ్యాల వ్యాపారం, సరఫరా,గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్‌ఐ రాహుల్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu