Dailyhunt
Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కాలేజీ వద్దు!

Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కాలేజీ వద్దు!

hmtv 1 week ago

Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కాలేజీ వద్దు!

Nizamabad: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ.తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ భూముల్లో ఏర్పాటు చేద్దామనుకుంటుందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.

ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి 577 ఎకరాలు, తెలంగాణ యూనివర్సిటీ కోసమే కేటాయించింది, అది పూర్తిగా తెలంగాణ యూనివర్సిటీకి రానున్న రోజుల్లో కోర్సులు మరియు ఎకడమిక్ సంబంధించి రీసెర్చ్ కి సంబంధించి వాడుకుంటానికి 577 ఎకరాలు కేటాయించింది, కాబట్టి అవి తెలంగాణ యూనివర్సిటీకె, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం రాజేంద్ర నగర్ అనుబంధ ప్రభుత్వ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం సరైనది కాదు.

ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ యూనివర్సిటీకి ఎన్నో ఇబ్బందులు రానున్న రోజుల్లో యూనివర్సిటీ ఎదుర్కుంటుంది ఎందుకంటే, రానున్న రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీలో నూతన కోర్సులు ఏర్పాటు చేయడానికి నూతన బిల్డింగులు ఏర్పాటు చేయడానికి అడ్డంకిగా ఆ కళాశాల మారుతుంది, దీనివల్ల తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి ఆగిపోతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను రీసర్చ్ ను అందించాలని ఉద్దేశంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ యూనివర్సిటీ,

ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి విద్య భవిష్యత్తునిచ్చింది ఇప్పుడు కూడా ఇస్తుంది, కాబట్టి అలాంటి విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి మరియు అలాగే విశ్వవిద్యాల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అకాడమిక్ విద్య ప్రధానంగా కలిగిన తెలంగాణ యూనివర్సిటీలో, వ్యవసాయ ప్రధానమైన వృత్తివిద్య కళాశాలను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకొని తెలంగాణ యూనివర్సిటీ భూములను తెలంగాణ యూనివర్సిటీకి ఉంచి,

వ్యవసాయ కళాశాలను వేరే స్థలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి తెలంగాణ యూనివర్సిటీ భూములు కాపాడడానికి ఎంతవరకైనా పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం 106 ఎకరాలు తెలంగాణ యూనివర్సిటీ భూమిని వ్యవసాయ కళాశాలకు ఇస్తున్నాం అని జీవో ఇస్తే యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తున్నారని, యూనివర్సిటీ గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే మాకెందుకులే యూనివర్సిటీ ఏమైతే మాకేందని అనుకుంటున్నారా అని వారు అన్నారు.

తక్షణమే తెలంగాణ యూనివర్సిటీ తరపున వైస్ ఛాన్స్లర్ గారు స్పందించి తెలంగాణ యూనివర్సిటీ భూముల్లో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయకుండా చూడాలి, అలాగే ప్రభుత్వంతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా వైస్ ఛాన్స్లర్ గారు కృషి చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సైన్స్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్,సతీష్ కార్యర్తలు కృష్ణ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu