Paderu: పాడేరులో వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ శ్రీమతి నిశాంతి
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు శివాలయం రోడ్ లో కలెక్టర్ శ్రీమతి నిశాంతి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాడేరు పట్టణంలోని శివాలయం రోడ్డులో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందజేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. కలెక్టర్ చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు.
వృద్ధుల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కలెక్టర్ వృద్ధులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు.

