పాలకొండ: పట్టణ ప్రజలు సమస్యల పద్మవ్యూహంలో చిక్కుకుని తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తాగునీటి కొరత మరొక వైపు కరెంటు కోతలతో నిత్యనరకం అనుభవిస్తున్నారు.
గడిచిన వారం రోజులుగా పాలకొండ పట్టణంలో 40డిగ్రీల పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇదే పరిస్థితి మరొక వారం రోజులు దాక ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కనీసం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పాలకొండ ప్రజలమీద వీరికి ఉన్న అభిమానానికి పరాకాష్ట.
పాలకొండ సబ్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లలో సాంకేతిక కారణాలు తలెత్తుతున్నాయి అనే సాకు చూపించి రోజుకి కనీసం 5 నుంచి ఆరుగంటలు పవర్ కట్ చేస్తున్నారు ఒక ముందస్తు సమాచారం ఉండదు, నష్టనివారణ చర్యలు ఉండవు, ముందుగా వాటికి చెయ్యాల్సిన మెయింటైనెన్స్ ఉండదు కానీ ఏ చిన్న సమస్య వచ్చిన పవర్ కట్ చేసి ప్రజలకు ఉక్కపోతను వేసవి బహుమతిగా అందిస్తున్నారు. తామేం తక్కువ తిన్నామా అన్నట్టుగా నగరపంచాయితీ వారికి కూడా ఈ పవర్ కట్ అస్త్రాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కుళాయి కట్ అంటూ నీటి ఎద్దడి సృష్టించి పాలకొండ పట్టణాన్ని ఎడారిలా మారుస్తున్నారు.

