పాలకొండ: పంటలకు మద్దతుధర పెంచాలని, పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తిచెయ్యాలని కోరుతూ జూన్ 8వ తేదీన మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి బంటుదాసు, జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు..
పాలకొండలోని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇతరదేశాల్లో రైతులను రాజుగా చూస్తారని మన రైతులకు కనీస మద్దతుధర కూడా ఇవ్వటంలేదని మండిపడ్డారు.
ఈ ఏడాది వరిపై క్వింటాలుకు 70 రూపాయిలు జొన్న పై పది రూపాయిలు మద్దతుధర పెంచడం రైతులను మోసం చేయడమే అన్నారు పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో మద్దతుధర పెంచాలని డిమాండ్ చేసారు. మన్యం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.. ఇప్పటికే జిల్లా అధికారులను, కలెక్టర్ ను కలిసి తమ సమస్యలను తెలియజేశామని వాటి పరిష్కారానికై పెద్ద ఎత్తున రైతులతో కలిసి జూన్ 8న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.. పత్రికా సమావేశంలో ఆయనతో పాటు ఆదర్శరైతు కండాపు ప్రసాద్ పాల్గొని ప్రభుత్వానికి రైతు సంక్షేమం కోసం కొన్ని సూచనలు తెలియజేసారు.

