Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palakonda: పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద రెండో రోజు ధర్నా

Palakonda: పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద రెండో రోజు ధర్నా

hmtv 1 week ago

పాలకొండ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై రేపు అన్ని కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించుటకు ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు. పాలకొండ RTC బస్సు డిపో వద్ద,17.5.26, ఆది వారము రెండవ రోజు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, సమస్య లుపై ధర్నా చేస్తున్న, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు.ఈ కార్యక్రమం లో పాళ్ళుగున్న, జోనల్ సెక్రటరీ, భాసురు కృష్ణ మూర్తి, మాట్లాడు తు ,(1) ప్రజా రవాణా ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, (2)ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచన విరమించుకోవాలని.

(3) విద్యుత్ బస్సు ఆపరేటర్ల కోసం డిపోలను కాళీ చేయించే విధానం మానుకోవాలని.(4) ఇంకా స్త్రీ-శక్తి పథకం విజయవంతం కావాలంటే తక్షణమే 3000 కొత్త బస్సులు కొని వెయ్యాలని. (5) ఆర్టీసీ లో ఉన్న అన్ని ఖాళీల ఉద్యోగలు భర్తీ చేయాలని.

(6) జీవో నెంబర్ 88 ని రద్దు చేయాలని. (7)పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఆర్టీసీని కాపాడుకోవాలని .(8) సర్కులర్ నెంబర్ 1 / 2019 ని పూర్తిస్థాయిలో అప్పటి తెలుగుదేశం,ప్రభుత్వం ఇచ్చినది అమలు చేయాలని. (9) మారుతున్న సాంకేతికత కు అనుగుణంగా గ్యారేజీ సిబ్బందికి మంచి శిక్షణలో ఇస్తూ, పవర్ టూల్స్ మరియు నాణ్యమైనటువంటి మెటీరియల్ సప్లై చేయాలని. (10) ఆర్టీసీ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆఫ్కాస్ ద్వారా జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని.

(11) సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని. (12), 11వ పిఆర్సి అరియర్స్ పెండింగ్లో ఉన్న డి ఏ అరియర్స్ వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాలని. (13) కొత్త డిఏలు, (iR )వెంటనే ప్రకటించాలి, 12వ పిఆర్సి కమిషన్ను నియమించాలి. (14) టిమ్స్, డామేజ్ లపై చేస్తున్న రికవరీ వెంటనే నిలుపుదల చేయాలి కాలం చెల్లిన పాత టిమ్స్ స్థానంలో కొత్త టీమ్స్ తక్షణమే అందించాలి.(15) అన్ని వర్క్ షాప్ లో నెలవారి మూవింగ్ యావరేజ్ టిఆర్ఎస్ మాదిరిగా ఇవ్వాలి పెండింగ్ ఉన్న మూవింగ్ యావరేజ్ ను చెల్లించాలి.(16), గెలవలో నుండి పెండింగ్లో ఉన్న నైట్ ఆల్టోరియర్స్ తక్షణమే ఇప్పించాలి.

(17), అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ ఆసుపత్రులలో ఏర్పాటు చేయాలి. (18) కాలం చెల్లిన బస్సులు బ్రేక్ డౌన్ కు గ్యారేజీ ఉద్యోగులను బాధ్యులు చేస్తూ ఇచ్చే పనిష్మెంట్ల విధానాన్ని రద్దు చేయాలి. (19) ఈ హెచ్ ఎస్, ద్వారా సరైన వైద్య సౌకర్యాలు అందనందున పాత రిఫరల్ విధానంలో వైద్య సేవలు ఆర్టీసీ ఉద్యోగులకు అందించాలి. (20) ఈపీఎస్ నుండి సిపిఎస్ పెట్టుకున్న, ఆర్టీసీ ఉద్యోగుల పిఎఫ్ అకౌంట్ లో ఉన్న డబ్బులను వెంటనే చెల్లించాలి.

(21) ఏలూరు డిపో రాజంపేట డిపోలో ఉన్న పెట్రోల్ బంకుల నిర్వహణలో జరిగిన పొరపాట్లు వలన అన్యాయంగా సస్పెండ్ చేసిన వారికి తక్షణమే విధులకు తీసుకోవాలి., అని వినతిపత్రం సమర్పించడం జరిగినదని, రేపు 18/5/26, సోమవారం రాష్ట్రం మొత్తం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు సమర్పించుటకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉందని,ఈరోజు జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉద్యోగస్తులకు జోనల్ సెక్రెటరీ బికే మూర్తి పిలుపునిచ్చితిరి. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు భారీ ఎత్తులో ఉద్యోగస్తులు పాల్గొని నిరసన తెలియజేసితిరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu