Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palakonda: పాలకొండ మున్సిపాలిటీలో వార్డుల రచ్చ.. అధికారులపై టీడీపీ ఫైర్!

Palakonda: పాలకొండ మున్సిపాలిటీలో వార్డుల రచ్చ.. అధికారులపై టీడీపీ ఫైర్!

hmtv 2 days ago

Palakonda: పాలకొండ మున్సిపాలిటీలో వార్డుల రచ్చ.. అధికారులపై టీడీపీ ఫైర్!

Palakonda: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ అధికారుల అవగాహనా రాహిత్యంతో అస్తవ్యస్తంగా జరిగిందని టీడీపీ నగర అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి ఆరోపించారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం నగర పంచాయతీ కమిషనర్ కి అభ్యంతర పిటిషన్ అందజేశారు.

నగర పంచాయతీ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా వార్డుల పునర్విభజన ముసాయిదా రూపొందించారని సింహాద్రి పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఏ వార్డు పరిధిలో ఏయే వీధులు ఉన్నాయో స్పష్టంగా పేర్కొనలేదన్నారు. అలాగే ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల ఓటర్ల వివరాలు కూడా లేకుండా అయోమయం సృష్టించారని తెలిపారు.

దీనిపై వెంటనే స్పందించి వార్డుల పునర్విభజన ముసాయిదాను రద్దు చేసి, అన్ని పార్టీల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని న్యాయబద్ధంగా, పారదర్శకంగా తిరిగి పునర్విభజన చేపట్టాలని కమిషనర్‌ను కోరినట్లు సింహాద్రి వెల్లడించారు అలాగే జిల్లా కలెక్టర్ గారికి పాలకొండ సభ కలెక్టర్ గారికి అభ్యంతర పీటేషన్ అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు ఆయనతోపాటు టిడిపి నాయకులు ఎస్ దుర్గారావు, దుమ్ముదు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu