Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palakonda: పాలకొండలో వార్డుల విభజన రగడ.. అశాస్త్రీయమన్న వైసిపి నాయకులు!

Palakonda: పాలకొండలో వార్డుల విభజన రగడ.. అశాస్త్రీయమన్న వైసిపి నాయకులు!

hmtv 2 weeks ago

Palakonda: పాలకొండలో వార్డుల విభజన రగడ.. అశాస్త్రీయమన్న వైసిపి నాయకులు!

Palakonda: నగర పంచాయతీ వార్డుల విభజన సక్రమంగా లేదు...వైసిపి పట్టణ అధ్యక్షుడు మన్మధరావు....పాలకొండ...నగర పంచాయతీ వార్డుల విభజన సక్రమంగా లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు శుక్రవారం స్థానిక నగర పంచాయతీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల నగర పంచాయతీ వార్డుల విభజన అశాస్త్రయంగా జరిగిందని దీనిని సరిచేసి సక్రమంగా 28 వార్డులు గా విభజించాలని డిమాండ్ చేశారు 23వ తేదీ నాడు వార్డుల విభజనపై మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తో కలిసి మాజీ కౌన్సిలర్స్ వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపడం జరిగిందని పేర్కొన్నారు తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు.

అయినప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాస్త్రీయమైనటువంటి వార్డుల విభజనపై కమిషనర్ను టౌన్ ప్లానింగ్ అధికారిని కలవడం జరిగిందని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీధులను వేరుచేసి గృహాలను తప్పించి అశాస్త్రీయమైన విభజనవార్డులను చేయరాదని కోరారు వార్డుల ప్రక్రియ ఏ వీధికి ఆ వీధి ఉంచే విధంగా వార్డులు ప్రక్రియ చేయాలని అలాగే ఓటర్ ఐడి నెంబర్లను డోర్ నెంబర్లను ప్రమాణికంగా తీసుకొని పద్ధతి ప్రకారం వార్డుల విభజన చేయాలని ఈ సందర్భంగా కోరారు గతంలో 20 వార్డులు ఉన్నప్పటికీ వీధులను ఏకం చేస్తూ శాస్త్రీయ పద్ధతిలో ఉండేవని ఇప్పుడు వీధులను వేరు చేస్తూ సుదూర ప్రాంతానికి వీధులను కలపడం ఇల్లులను విడదీయడం వార్డుల విభజన ప్రక్రియ కరెక్ట్ గా లేదని అన్నారు.

దీనిపై అవసరం వస్తే మా నాయకులు పాలవలస విక్రాంత్ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సహాయ సహకారాలతో న్యాయపోరాటం చేసి వార్డుల విభజన సక్రమంగా చేసేంతవరకు వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు ఇచ్చిన అర్జీలను పరిగణలోకి తీసుకొని వార్డుల విభజన సక్రమంగా జరగాలని కోరారు ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్స్,కడగల వెంకటరమణ,కొడెం విజయ్ కుమార్,దుంపల రమేష్ బాబు,భాసూరు కాంతారావు తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu