Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palnadu: బొల్లా విమర్శలకు ఎంపీ లావు ఘాటు కౌంటర్!

Palnadu: బొల్లా విమర్శలకు ఎంపీ లావు ఘాటు కౌంటర్!

hmtv 1 hr ago

Palnadu: బొల్లా విమర్శలకు ఎంపీ లావు ఘాటు కౌంటర్!

Palnadu: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనపై చేసిన ఆరోపణలకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా స్పందించారు.

లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం ఉందని బొల్లా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. భూ దందాల బురదలో ఉన్న బొల్లా అందరినీ అదే బురదలోకి లాగాలని ప్రయత్నించడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.

గతంలో పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పీఆర్‌కే, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై కూడా బొల్లా అవినీతి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. జనసేనకు చెందిన ఓ నాయకుడి భూ వ్యవహారంలో బొల్లా రూ.31 కోట్లు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.

బొల్లాపై కేసు నమోదు చేయాలనుకుంటే ఇప్పుడే చేయగలమని, కానీ చట్టపరమైన ఆధారాలతోనే ముందుకు వెళ్తామని అన్నారు. "నీలా నేను మాటలతో హడావుడి చేయను.. చేయాల్సింది చేస్తా" అంటూ హెచ్చరించిన లావు, బొల్లా చేసిన భూదందాలు, అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu