Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palvancha: భగ్గుమన్న నిరసనలు.. నటరాజ్ సెంటర్‌లో ఏం జరిగిందంటే?

Palvancha: భగ్గుమన్న నిరసనలు.. నటరాజ్ సెంటర్‌లో ఏం జరిగిందంటే?

hmtv 1 week ago

Palvancha: భగ్గుమన్న నిరసనలు.. నటరాజ్ సెంటర్‌లో ఏం జరిగిందంటే?

పాల్వంచ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ పాల్వంచ నటరాజ్ సెంటర్ వద్ద సీపీఐ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, "పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం వెంటనే ధరలు తగ్గించాలి" అని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో ఆటో డ్రైవర్లు, రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కేంద్రం స్పందించి ఉపశమనం కలిగించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu