Dailyhunt
Parvathipuram: డేంజర్ జోన్‌లో మన్యం జిల్లాలోని 15 మండలాలు..

Parvathipuram: డేంజర్ జోన్‌లో మన్యం జిల్లాలోని 15 మండలాలు..

hmtv 1 week ago

Parvathipuram: డేంజర్ జోన్‌లో మన్యం జిల్లాలోని 15 మండలాలు..

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

ఈ మేరకు తాజా 'హీట్ ఇండెక్స్' ఫోర్‌కాస్ట్ వివరాలను వెల్లడించిందనిప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి అన్నారు. జిల్లాలోని 15 మండలాలు 'డేంజర్ కేటగిరీ'లో (41°C - 54°C హీట్ ఇండెక్స్) ఉండే అవకాశం ఉంది.కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి మరియు పాలకొండ మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాబోయే ఐదు రోజులకు సంబంధించి జిల్లాలో ఎలాంటి వర్ష సూచనలు లేవని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ​ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu