Parvathipuram: మన్యం జిల్లా హైవేపై పోలీసుల స్పెషల్ స్కెచ్.. వాహనాలకు బ్రేక్!
పార్వతీపురం: పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ వారు జిల్లాలో ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులలో ప్రతి కేసును క్షుణ్ణంగా సమీక్షించి ఏ ఏ ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో గుర్తించి వాటిని తగ్గించడానికి ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు పాలకొండ డిఎస్పి శ్రీ ఎం రాంబాబు గారి సూచనలు అనుసరించి చిన్న మేరంగి సీఐ శ్రీ టీవీ తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్కంపెనీ వారి సహకారంతో ఈరోజు గరుగుబిల్లి మండలం లోని తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే పార్వతీపురం పాలకొండ రోడ్డుపై సుంకి గ్రామం సమీపంలో వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం zig zag తరహాలో stoppers పెట్టడం జరిగింది.
ఇదే విధంగా మండలంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రమాదాలు నివారించడానికి సహకరిస్తామని ముందుకు వచ్చిన నాగార్జున సిమెంట్ కంపెనీ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు.

