Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Parvathipuram: మన్యం జిల్లాలో కలెక్టర్ సీరియస్.. షాపులపై అధికారుల మెరుపు దాడులు!

Parvathipuram: మన్యం జిల్లాలో కలెక్టర్ సీరియస్.. షాపులపై అధికారుల మెరుపు దాడులు!

hmtv 0 months ago

Parvathipuram: మన్యం జిల్లాలో కలెక్టర్ సీరియస్.. షాపులపై అధికారుల మెరుపు దాడులు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ రైడ్ గుమ్మలక్ష్మీపురంలో భారీగా గడువు ముగిసిన ఆహార పదార్థాల గుర్తింపు జిల్లాలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రతా విభాగం తనిఖీలను ముమ్మరం చేసింది.

జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్ది శుక్రవారం పర్యటన లో ఆదేశాల మేరకు గుమ్మలక్ష్మీపురం పరిధిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (డివిజన్-1) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో గడువు ముగిసిన (ఆహార పదార్ధాలు,కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి, సంబంధిత వ్యాపారులపై అడ్యుడికేషన్ కేసులు దాఖలు చేశారు.

​తనిఖీ బృందం గుమ్మలక్ష్మీపురంలోని ఏడు ప్రధాన వ్యాపార సంస్థలను తనిఖీ చేయగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి, క్యాంపా కోలా, పెప్సీ, థమ్సప్, 7UP వంటి బ్రాండెడ్ కూల్ డ్రింక్స్‌తో పాటు ఎనర్జీ డ్రింక్స్ వందల సంఖ్యలో గడువు ముగిసినా విక్రయానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు, బిర్యానీ పౌడర్, సాంబార్ పౌడర్, సోన్ పాపిడి వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కూడా ఎక్స్‌పైరీ డేట్ దాటినట్లు కనుగొన్నారు. బుడంకాయల మదన్ కుమార్, పుట్నూరు సుందర్ రావు, బి. నాగరాజు, అందవరపు శ్రీనివాసరావు, డోకి శ్రీధర్, మాజి వెంకటకృష్ణ, చప్పా మాధవ నాయుడు అనే వ్యాపారుల షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

​ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 (FSSAI Act) ప్రకారం, గడువు ముగిసిన వస్తువులను విక్రయించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన స్టాక్‌ను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తెలిపారు. ​వినియోగదారులు ఏదైనా ఆహార పదార్థం లేదా పానీయం కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా ప్యాకెట్‌పై ఉన్న 'ఎక్స్‌పైరీ డేట్' చూసుకోవాలని అధికారులు కోరారు. నాణ్యత లేని వస్తువుల గురించి సమాచారం ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu