Dailyhunt
Parvathipuram Manyam: వెంకన్న సాక్షిగా నిరసన.. టీటీడీ పవిత్రత కోసం వైసీపీ పోరాటం

Parvathipuram Manyam: వెంకన్న సాక్షిగా నిరసన.. టీటీడీ పవిత్రత కోసం వైసీపీ పోరాటం

hmtv 1 week ago

Parvathipuram Manyam: వెంకన్న సాక్షిగా నిరసన.. టీటీడీ పవిత్రత కోసం వైసీపీ పోరాటం

పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం మండలం కస్పా గదబవలస గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి సన్నిధానం వద్ద మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల.పుష్పశ్రీవాణి, మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం టి టి డి చైర్మన్ బి.ఆర్ నాయుడు ను తొలగించాలని ప్ల కార్డు లు పట్టుకుని వైసీపీ శ్రేణుల నిరసన తెలియజేసారు.

ఈ సందర్బంగా పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ..

మహిళతో B. R. నాయుడు అసభ్యకరంగా ప్రవర్తించినప్పటికీ పక్కా ఆధారాలు తో బయటకు వచ్చినప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను వెనకేసుకుని రావడం సిగ్గుచేటని విమర్శించారు. తిరుమల దేవస్థానం చైర్మన్ పదవికి బి ఆర్ నాయుడు అపవిత్రం చేశారంటూ పుష్ప శ్రీవాణి మండిపడ్డారు.చైర్మన్ పదవి నుండి తక్షణమే ఆయనను తొలగించాలంటూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu