Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddapalli: ఓదెల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Peddapalli: ఓదెల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

hmtv 1 week ago

Peddapalli: ఓదెల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

పెద్దపల్లి: అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో.. మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయాన్నే ఆలయ కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మల్లన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన పట్నాలు వేసి, బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు తీర్చుకుంటున్నారు. వేసవి ఎండల దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, నీడ వంటి వసతులను కల్పిస్తూ భక్తుల రద్దీని ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu