Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddapalli: పెగడపల్లిలో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు!

Peddapalli: పెగడపల్లిలో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు!

hmtv 5 days ago

Peddapalli: పెగడపల్లిలో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ కొలుపు ఉత్సవాల్లో భాగంగా ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.

బోనాల సందర్భంగా గౌడ మహిళలు నెత్తిన బోనమెత్తుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తులను నుత్యాల మధ్య పురవీధుల గుండా ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని ముక్కులు సమర్పించారు. బోనాల వేడుకల్లో ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ అరెల్లి రమేష్ లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యేను గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు సక్రమంగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు వీరగోని సదయ్య, ఉపాధ్యక్షులు గోపగోని రాజయ్య, డైరెక్టర్లు గోపగోని సమ్మయ్య, గోపగోని శ్రీనివాస్, గోపగోని సదయ్య, గట్టు రమేష్,గట్టు సదయ్య, బొంగుని శ్రీనివాస్, గోపగోని శ్రీనివాస్, గౌడ సంఘ కులస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu