Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddaraveedu: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

Peddaraveedu: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

hmtv 1 week ago

Peddaraveedu: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

పెద్దారవీడు: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చెట్లమిట్ట గ్రామంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా చెట్లమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

గ్రామంలోని ప్రధాన వీధులలో ర్యాలీ చేపట్టి డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా MPHEO డి. సత్యామయ్య మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి శుక్రవారం "ఫ్రైడే-డ్రైడే" పాటించాలని, దోమతెరలు వినియోగించాలని సూచించారు. అలాగే "చెక్ - క్లీన్ - కవర్" అనే మూడు ముఖ్యమైన అంశాలను ప్రతిరోజూ పాటించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఏ. భరత భూషణ్, ల్యాబ్ టెక్నీషియన్ బి. నవీన్ కుమార్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu