Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddaraveedu: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది లక్ష్మిరెడ్డి

Peddaraveedu: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది లక్ష్మిరెడ్డి

hmtv 2 weeks ago

Peddaraveedu: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది లక్ష్మిరెడ్డి

పెద్దారవీడు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసి ధృవీకరించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.

పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో ఎస్‌ఐఆర్ (Special Intensive Revision - SIR) ప్రక్రియలో భాగంగా మండల బూత్ కోఆర్డినేటర్ ఒద్దుల లక్ష్మిరెడ్డి తన ఓటును అధికారికంగా ధృవీకరించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఎల్ఓ (BLO) అధికారులు, బీఎల్ఏలు (BLAలు) ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఓటరు వివరాల ధృవీకరణ, కొత్తగా అర్హత పొందిన వారి నమోదు, మార్పులు-చేర్పులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మూల రమణారెడ్డి, ఎంపీటీసీ పోటు గంగయ్య, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎన్నికల సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu