Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podili: పొదిలిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

Podili: పొదిలిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

hmtv 1 week ago

Podili: పొదిలిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

పొదిలి: మే 16 న జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పొదిలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి గురించి, డెంగ్యూ వ్యాధి లక్షణాలు మరియు డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది.

డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్టై అనే దోమ ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కలిగిన వారు జ్వరం, తలనొప్పి, కళ్ళు ఎర్రబడడం, ఇంటర్నల్ బ్లీడింగ్ వంటి లక్షణాలు కనబడతాయి మరియు రక్త కణాలు తగ్గిపోవును. కావున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటితోట్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి బొండాలను రెండుగా చీల్చి పారవేయాలి. పగిలిన గ్లాసులు, కూలర్లు మరియు ఫ్రిడ్జ్ లలో ఉన్న మురికి నీటిని శుభ్రం చేసుకోవాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu