Dailyhunt
Post Office: వడ్డీతోనే రూ. 18 లక్షలు పొందొచ్చు.. పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్

Post Office: వడ్డీతోనే రూ. 18 లక్షలు పొందొచ్చు.. పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్

hmtv 4 days ago

Post Office

Post Office: భారతదేశంలో సురక్షిత పెట్టుబడుల కోసం చూస్తున్నవారికి పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు ముఖ్యంగా పీపీఎఫ్ (Public Provident Fund) స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రిస్క్ లేకుండా మంచి లాభం పొందొచ్చు.

దీర్ఘకాలికంగా డబ్బు పెంచుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరమైన పథకం.

PPF స్కీమ్ అంటే ఏమిటి?

PPF అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక దీర్ఘకాలిక సేవింగ్స్ స్కీమ్. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మార్కెట్ మార్పుల ప్రభావం దీనిపై ఉండదు కాబట్టి పెట్టుబడిదారులకు నమ్మకం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై సుమారు 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీని ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షిస్తుంది కానీ సాధారణంగా స్థిరంగా ఉంటుంది.

ట్యాక్స్ ఫ్రీ లాభాలు

PPF స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ట్యాక్స్ పరంగా పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఇందులో మీరు పెట్టే డబ్బుకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మినహాయింపు లభిస్తుంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీపై కూడా ఎలాంటి పన్ను ఉండదు. చివరగా మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం కూడా పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. అందువల్ల దీన్ని పూర్తి ట్యాక్స్ ఫ్రీ పెట్టుబడి పథకంగా భావిస్తారు.

15 సంవత్సరాల్లో ఎలా రూ. 18 లక్షల వడ్డీ వస్తుంది?

ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల్లో మొత్తం రూ. 22.5 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై సుమారు 7.1 శాతం వడ్డీ క్రమంగా చేరుతూ ఉంటుంది. కాలం పూర్తయ్యే సమయానికి మొత్తం విలువ సుమారు రూ. 40.68 లక్షలకు చేరుతుంది. ఇందులో దాదాపు రూ. 18.18 లక్షలు కేవలం వడ్డీ రూపంలోనే వస్తాయి. దీర్ఘకాలికంగా క్రమంగా పెట్టుబడి పెడితే చిన్న మొత్తం కూడా ఎలా పెద్దదిగా మారుతుందో ఇది చూపిస్తుంది.

చిన్న మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభం

PPF స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే, తక్కువ మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. కనీసంగా రూ. 500తో అకౌంట్ ఓపెన్ చేసి సేవింగ్స్ మొదలు పెట్టొచ్చు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. పెట్టుబడిని ఒకేసారి లేదా కొద్దికొద్దిగా ఏడాది మొత్తం వేసుకోవచ్చు. దీంతో చిన్న ఆదాయం ఉన్నవారికి కూడా ఇది సులభమైన మార్గంగా ఉంటుంది.

ఎవరెవరు పెట్టుబడి పెట్టవచ్చు?

ఈ స్కీమ్‌లో పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు ఉంటుంది. అయితే అవసరమైతే దీన్ని 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకోవచ్చు. భారతీయ పౌరులెవ్వరైనా ఈ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. చిన్నారుల పేరుతో కూడా అకౌంట్ తెరవవచ్చు, కానీ అది తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటుంది. ఒఇందులో జాయింట్ అకౌంట్ సౌకర్యం ఉండదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu