Prakasam: ఎరువులు దుకాణాల షాపు యజమానులకు అవగాహన
ప్రకాశం జిల్లా: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు మరియు ఎరువుల దుకాణాల షాప్ యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన దర్శి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రమేష్ , ఆయన రైతులతో మాట్లాడుతూ వ్యవసాయతర పంట భూములలో అధిక రసాయనిక ఎరువులు , యూరియాలు, వినియోగించడం మంచిది కాదన్నారు, మట్టి నమూనాలు భూపరీక్షలు ఆధారంగా ఆయా పంటలకు ,ఎంత మోతాదు ఎరువులు వాడే విషయాన్ని రైతులు వ్యవసాయ అధికారులను అడిగి వారి సూచనలు మేరకు ఎరువులు వాడాలన్నారు.

