Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Proddatur: అప్పుడు దోచేశారు.. ఇప్పుడు అరుస్తున్నారు: వైసీపీ లీడర్లపై ముక్తియార్ ఫైర్!

Proddatur: అప్పుడు దోచేశారు.. ఇప్పుడు అరుస్తున్నారు: వైసీపీ లీడర్లపై ముక్తియార్ ఫైర్!

hmtv 6 days ago

Proddatur: అప్పుడు దోచేశారు.. ఇప్పుడు అరుస్తున్నారు: వైసీపీ లీడర్లపై ముక్తియార్ ఫైర్!

Proddatur: రాష్ట్ర షేక్ కార్పోరేషన్ ఛైర్మన్, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.

ముక్తియార్ ఆదివారం ప్రొద్దుటూరు లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శనివారం కడప కలెక్టరేట్ లో ప్రొద్దుటూరు లో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా మండలంలోని చౌడురు గ్రామ ఏరులో అభివృద్ధి పేరుతో పేద రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని ఏపీఐఐసి కి అప్పజేప్పి, పారిశ్రామికీకరణ పేరుతో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి ఇసుకను అక్రమంగా తరలించి ధనర్జాన చేస్తున్నారని ఆరోపించారని గుర్తు చేశారు.

కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం వుందని, ఎవరూ ఇసుకను అటువంటి తరుణంలో కొనుగోలు చేయరనే విషయం మరిచారా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు లో గత ప్రభుత్వంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఇసుకను ప్రక్క రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుని ప్రొద్దుటూరు లో ఇసుకను మాయం చేశారని, అదే విధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో వదిలారని, గత ప్రభుత్వంలో రాచమల్లు అభివృద్ధి పనులు చేయకుండానే బిల్లులు తెప్పించుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఒకవైపు రాజధాని నిర్మాణం, మరోవైపు పోలవరం నిర్మాణం, పారిశ్రామికీకరణ చేస్తుంటే నేటికీ వైసీపీ నాయకులు పెట్టుబడిదారులను భయపెట్టే వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదని గతంలో వారి ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఒక చేత్తో ఇంటి పట్టా, మరోక చేత్తో తాళంచెవి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వ్యవస్థ లను రాచమల్లు అదుపులో పెట్టుకొని, అసాంఘిక కార్యకలాపాలకు ప్రొద్దుటూరు ను అడ్డాగా చేశారని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మైదుకూరు రోడ్డు, కొర్రపాడు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి టికెట్ వచ్చే ప్రసక్తి లేదని వచ్చినా 50000 ఓట్లతో ఓడిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాబయ్య, టిడిపి నాయకులు షబ్బీర్, నీలాపురం బాషా, ఖాదర్ వల్లీ, ఖలీల్, జనసేన నాయకులు జిలానీ బాష తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu