Proddatur: ఎండలకు అడుగంటిన భూగర్భ జలాలు.. మూగజీవాల విలవిల
ప్రొద్దుటూరు: డివిజన్ పరిధిలో రోజురోజుకు ఎండలు తీవ్రతరం మవ్వడంతో ప్రజలు మూగజీవాలు విలవిల్లాడిపోతున్నాయి.
దప్పిక తీర్చుకునేందుకు ప్రొద్దుటూరు మండల కేంద్రంలో శుక్రవారం ఓ గోమాత పైప్ లైన్ ద్వారా నీటిని సేవించి దప్పిక తీర్చుకుంది. ఓ పక్క ఎండలు మండుతుండడంతో మరోపక్క భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయి ప్రజలు తాగునీటికి విలవిలాడుతున్నారు. పశుపక్షాదులు జంతువులు సైతం ఎండల తాకిడికి తట్టుకోలేక దప్పిక తీర్చుకునేందుకు కనిపించిన చోట దాహార్తిని తీర్చుకొని సేద తీరుతున్నాయి.

