Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Proddatur: కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి

Proddatur: కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి

hmtv 1 week ago

Proddatur: కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి

ప్రొద్దుటూరు: కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు.

రెండో మైసూర్ గా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు మరియు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు ను ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

మాజీమంత్రి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులతో మంత్రోచ్ఛారణల మధ్య మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమానంతరం కమిటీ సభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే రచమల్లు శివప్రసాద్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.. మాజీ మంత్రి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో ప్రొద్దుటూరు పట్టణాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఇంత బాగా అభివృద్ధి చేసినందుకు ఆనందంగా ఉంది.

వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు నుంచి తమ ఆర్యవైశ్య సోదరులైన చిప్పగిరి ప్రసాద్ మారుతీ ప్రసాద్ లకు టీటీడీ దేవస్థానంలో డైరెక్టర్లగా చేసిన ఘనత రాచమల్లుదని కొనియాడాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఏక్కడే గాని ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు వారిని కేవలం ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారే తప్ప సరైన స్థానం కల్పించలేదు అన్నారు. కన్యకా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ డైరెక్టర్లు చిప్పగిరి ప్రసాద్, మారుతీ ప్రసాద్, వంశీధర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu