Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Proddatur: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ విరాళం

Proddatur: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ విరాళం

hmtv 1 week ago

Proddatur: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ విరాళం

Proddatur: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కీ మోహన్ రెడ్డి కుమారుడు కీ.శే సాయి బాలాజీ రెడ్డి జ్ఞాపకార్థం విరాళంగా అంబులెన్సు ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం సురేష్ నాయుడు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆనుపత్రికి 17 లక్షల రూపాయల వ్యయంతో అంబులెన్సు అదే విదంగా గతంలో అనస్థీషియా మిషన్ ఇవ్వడం అభినందనీయమని ఆయన దాతృత్వాన్ని కొనియాడారు.

ఈ సందర్భంగా మడితాటి మోహన్ రెడ్డిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. టిడిపి నేత సియం సురేష్ నాయుడు మాట్లాడుతూ మోహన్ రెడ్డి వారి కుమారుడు కి.శే. సాయిబాలాజీ రెడ్డి జ్ఞాపకార్థం పేదవారికి ఎంతో ఉపయోగపడే అనస్థిషియా మిషన్ మరియు ఈ రోజు అంబులెన్సు ఇచ్చి ప్రతి నెల డ్రైవర్ కు 18 వేల రు జీతం ఇవ్వడం అభినందనీయం తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.యస్.ముక్తియర్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి, కెసి కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైన్ చైర్మన్ ద్వార్మల గురివి రెడ్డి, ఆనుపత్రి సూపరిడెంట్ ఆనంద్ బాబు, ఆర్ఎంవో రూపానంద్, డాక్టర్ వరుణ్ రెడ్డి, టిడిపి రాష్ట్ర వక్స్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్, టిఎన్ టియుసి జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్, యువ నాయకులు బచ్చల ప్రతాప్, మాజీ కౌన్సిలర్ వైఎస్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu