Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Punganur: టీడీపీలో మాటల యుద్ధం.. ప్రమాణాలకు రావాలంటూ నాయకుల సవాళ్లు!

Punganur: టీడీపీలో మాటల యుద్ధం.. ప్రమాణాలకు రావాలంటూ నాయకుల సవాళ్లు!

hmtv 1 week ago

Punganur: టీడీపీలో మాటల యుద్ధం.. ప్రమాణాలకు రావాలంటూ నాయకుల సవాళ్లు!

Punganur: ఈ నేపథ్యంలో భారత చైతన్య యోజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గత కొన్ని రోజుల క్రితం విద్యా హక్కు చట్టంపై తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్యను ప్రైవేటు పాఠశాలలు అమలు చేయడం లేదని ఇందుకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ముడుపులు అందాయని ఆరోపించారని ఇది సత్య దూరమని దమ్ముంటే రుజువు చేయాలని అలాగే రాజనాలబండ కు వచ్చి ప్రమాణం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ సోషల్ మీడియా వేదికగా సవాలు విసిరారు దీనికి స్పందించిన బీసీవై పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మధుసూదన్ రాయల్ కు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు.

రామచంద్ర యాదవ్ కుటుంబ సభ్యులపై ప్రస్తావిస్తూ అసభ్యంగా మాట్లాడారని మరియు బీసీవై పార్టీ వైకాపాకు కోవర్టుగా పనిచేస్తోందని ఆరోపించారని ఇదే విషయమై రాజనాల బండ ఆలయంలో ప్రమాణకానికి రావాలంటూ ఈనెల 27వ తేదీన రాజనాల బండలో పూల ప్రేమ్ కుమార్ వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో బీసీవై పార్టీ అధినేతకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వైసీపీ పార్టీతో సంబంధాలు లేవని మేము కొవ్వొత్తుల కాదని ప్రమాణం చేసి చెబుతున్నానని ఆలయం వెలుపల సమావేశంలో తెలిపారు తెలుగుదేశం నాయకుడు మధుసూదన్ రాయల్ శనివారం తన మాటలకు కట్టుబడి ఆలయంలో ప్రమాణ స్థానిక రావాలంటూ మరల సవాల్ విసరడం జరిగింది ఉదయమే కుల ప్రేమ్ కుమార్ రాజనాల బండ ఆలయంలో పూజలు చేసుకుని తెలుగుదేశం నాయకుడు మధుసూదన్ రాలేదని తెలిపి వెళ్లిపోయారు

అయితే మధుసూదన్ రాయల్ ఉదయం 10 :20 నిమిషాలకు ఆలయం వద్దకు ప్రమాణకానికి రావడంతో ఆసక్తి నెలకొంది మధుసూదన్ రాయల్ మాట్లాడుతూ నేను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారిని ప్రమాణం చేయాలని చెప్పాను కానీ ఆయన చెంచాలను కానీ ఆయన తొత్తులను కానీ ప్రమాణం చేయమని సవాలు విసరలేదని అయితే పూల ప్రేమ కుమార్ ను పుంగనూరు పట్టణంలోని షటిల్ ఇండోర్ కోర్టు ను అర్ధరాత్రి దొంగతనంగా తన కుటుంబ సభ్యులు కూల్చలేదా దమ్ముంటే ఈ విషయంపై ప్రమాణం చేయాలని అన్నానన్నారు అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడటం సబబు కాదని నా నాలుకలు కోస్తా అంటూ విర్రవీగడం ఏంటని ప్రశ్నించారు. తను పూల ప్రేమ కుమార్ సవాలను స్వీకరిస్తూ రాజనాల బండకు ప్రమాణకానికి వస్తా నని సోషల్ మీడియా వేదికగా సమాచారం తెలిపిన తను వచ్చేలోపే అవాకులు చవాకులు మాట్లాడి వెళ్లిపోవడం ఏంటని ఎద్దేవా చేశారు తన మాటలకు ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నానని మీకు మీ నాయకునికి దమ్ముంటే రాజనాలబండకొచ్చి మీరు చేసిన ఆరోపణలను ఒప్పుకొని ప్రమాణకం చేయాలని ఇందుకు తను ఎప్పుడో సిద్ధంగానే ఉన్నానని తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu