Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Quthbullapur: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు!

Quthbullapur: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు!

hmtv 2 weeks ago

Quthbullapur: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు!

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారు మాట్లాడుతూ బోనాల ఉత్సవాల్లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బోనాలు ప్రజల ఐక్యతను, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబిస్తూ, ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండగ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు, తాజా మాజీ కౌన్సిలర్లు, గడ్డపోతారం మునిసిపల్ కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu