Quthbullapur: నిజాంపేట్ హడల్.. మళ్ళీ భారీ అగ్నిప్రమాదం!
కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సుమారు 6 ఫర్నిచర్ దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. షాపుల్లో నిల్వ ఉంచిన ఫర్నిచర్ సామగ్రి పూర్తిగా దగ్ధమై లక్షల రూపాయల నష్టం జరిగింది...సమాచారం అందుకున్న వెంటనే 4 అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవలే ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో మళ్లీ ఇలాంటి ఘటన జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఉపశమనంగా మారింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

