Dailyhunt
Quthbullapur: నిజాంపేట్‌లో చెత్త తిప్పలు.. మున్సిపల్ ఆఫీస్‌లో ధర్నాకు సై!

Quthbullapur: నిజాంపేట్‌లో చెత్త తిప్పలు.. మున్సిపల్ ఆఫీస్‌లో ధర్నాకు సై!

hmtv 1 week ago

Quthbullapur: నిజాంపేట్‌లో చెత్త తిప్పలు.. మున్సిపల్ ఆఫీస్‌లో ధర్నాకు సై!

కుత్బుల్లాపూర్: నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.

చెత్త పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యం, దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డ్‌లో చెత్తను నిల్వ చేసి, జవహర్ నగర్ కు తరలించాల్సిన వ్యర్థాలను సమయానికి తరలించడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల చెత్త స్థానికంగా పేరుకుపోయి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది.

ప్రతి మూడు నెలలకు సుమారు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తూ చెత్తను తరలిస్తున్నప్పటికీ, ఇది శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఖర్చుతో స్థానికంగా Solid Waste Processing Unit ఏర్పాటు చేయవచ్చని, లేకపోతే జగద్గిరిగుట్ట తరహాలో కంప్రెసింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిజాంపేట్ డిప్యూటీ కమిషనర్ షబీర్ అలీ సరైన పర్యవేక్షణ, స్పందన చూపడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదనంగా, ప్రస్తుత కాంట్రాక్టర్ గడువు ముగియడం, Ramky Enviro Engineers Limited తో సమయానికి ఒప్పందం కుదరకపోవడం వల్ల డంపింగ్ యార్డ్ నిండిపోగా, చెత్తను రోడ్లపై వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఈ వ్యవస్థ కొనసాగుతున్న విధానం ప్రజా ప్రయోజనాల కంటే కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం నడుస్తోందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్థానిక నాయకుడు ఆకుల సతీష్ డిమాండ్ చేస్తూ తెలిపారు:

నిజాంపేట్ డంపింగ్ యార్డ్ పై తక్షణ పరిశీలన చేయాలి, ప్రతిరోజు సుమారు 180 టన్నుల చెత్తను క్రమం తప్పకుండా Jawahar Nagar కు తరలించాలి. శాశ్వత పరిష్కారం దిశగా ఏర్పాటు చేయాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే, వచ్చే రెండు రోజుల్లో డంపింగ్ యార్డ్‌లోని చెత్తను మొత్తం తరలించకపోతే, కాలనీ ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త వేసి ధర్నా చేపడతామని ఆకుల సతీష్, మరియు కాలనీవాసులు హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu