Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajahmundry: రాజమండ్రి భాస్కర్ నగర్‌లో ద్వితీయ వార్షిక గణపతి ఉత్సవాలు!

Rajahmundry: రాజమండ్రి భాస్కర్ నగర్‌లో ద్వితీయ వార్షిక గణపతి ఉత్సవాలు!

hmtv 51 mins ago

Rajahmundry: రాజమండ్రి భాస్కర్ నగర్‌లో ద్వితీయ వార్షిక గణపతి ఉత్సవాలు!

Rajahmundry: రాజమండ్రి స్థానిక సీటీఆర్‌ఐ భాస్కర్ నగర్‌లో భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటి అధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వితీయ వార్షిక గణపతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

గణనాథుడి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. హరి బెనర్జీ దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు.

తొమ్మిది రోజుల పాటు గణపతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించడంతో పాటు భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు మరుకుర్తి రవి యాదవ్, అడబాల రాజు, మరుకుర్తి కుమార్ యాదవ్ లు తెలిపారు. . పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ భరత్ రామ్, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాలరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు, నక్కా చిట్టిబాబు, కాశి నవీన్, దొమడపాటి సత్యం బాబు జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై. శీను, వివిద పార్టిలకు చెందిన నాయకులు కురగంటి సతీష్, కాలెపు సాయిరామ్, జవ్వాది మురలీ కృష్ణ, విజయలక్ష్మి, బూరాడ రమేష్ ప్రసాద్, చింతపల్లి నాని, పితారామకృష్ణ, అను యాదవ్, అనంతలక్ష్మి, కృష్ణవేణి, గుత్తుల హర్షా, కానుబోయిన సాగర్, యాదవ సంఘం నాయకులు అంకం గోపి, బర్ల బాబూరావు, నక్కెళ్ళ బాబూరావు, నొడగల సుధ, జానా కేసవ, పడాల నాగరాజు, పడాల శ్రీను తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు . గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.గణపతి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటేలా నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, షేక్ మదీనా భాష, , బాబ్జి, ప్రకాష్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్, హరికుమార్ బొట్ట, అడబాల బాలు, సిటిఆర్ య బాసి, ఎ1 గంగాధర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu