Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ram Charan: అన్న దయచేసి ఆ హీరోయిన్‌తో నటించకు!

Ram Charan: అన్న దయచేసి ఆ హీరోయిన్‌తో నటించకు!

hmtv 2 weeks ago

Ram Charan: అన్న దయచేసి ఆ హీరోయిన్‌తో నటించకు!

Kiara Advani: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

దాదాపు నెల రోజులుగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ.. అంచనాలకు మించి వసూళ్లను రాబడుతోంది. ఈ సూపర్ హిట్ ఉత్సాహంలో ఉన్న రామ్ చరణ్, తన తదుపరి ప్రాజెక్ట్‌ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. RC 17 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే, తాజాగా ఈ సినిమా హీరోయిన్ ఎంపికకు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని కథానాయికగా ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ అనగానే వారు సోషల్ మీడియాలో తలలు పట్టుకుంటున్నారు. దానికి బలమైన కారణం లేకపోలేదు. రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'వినయ విధేయ రామ'.. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్'.. ఈ రెండు సినిమాల్లోనూ కియారానే హీరోయిన్.

విచిత్రం ఏమిటంటే.. భారీ అంచనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇవి అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఒక సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. చరణ్‌కు కియారా కలిసిరావడం లేదని, దయచేసి RC 17 ప్రాజెక్ట్ లోకి ఆమెను వద్దంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు సుకుమార్‌ను, చిత్ర యూనిట్‌ను కోరుతున్నారు.

ఫ్యాన్స్ ఇంతలా మొత్తుకుంటున్నప్పటికీ, దర్శకుడు సుకుమార్ మాత్రం కియారా అద్వానీ వైపే మొగ్గు చూపినట్లు టాక్ నడుస్తోంది. కథ డిమాండ్ మేరకు ఆమె అయితేనే కరెక్ట్ అని భావించి, కియారాను ఫైనల్ చేసినట్లు వినికిడి. సెంటిమెంట్ల కంటే కంటెంట్‌నే నమ్మే సుకుమార్, ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నారేమో. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, సుకుమార్ ఇప్పటికే ఈ సినిమా స్టోరీ బోర్డు, టెక్నికల్ టీం ఎంపికపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి కియారా అద్వానీ ఎంట్రీ ఇస్తుందో లేదో.. ఒకవేళ వస్తే ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌ను తిరగరాస్తుందో లేదో చూడాలి.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu