Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramadugu: జగిత్యాల హైవే దిగ్బంధం.. వడ్ల కొనుగోళ్లపై అన్నదాతల ఆగ్రహం!

Ramadugu: జగిత్యాల హైవే దిగ్బంధం.. వడ్ల కొనుగోళ్లపై అన్నదాతల ఆగ్రహం!

hmtv 2 weeks ago

Ramadugu: జగిత్యాల హైవే దిగ్బంధం.. వడ్ల కొనుగోళ్లపై అన్నదాతల ఆగ్రహం!

రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో రైతుల సమస్యలు మళ్లీ రోడ్లపైకి వచ్చాయి.

వెధిర బస్టాండు వద్ద కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం రైతులు భారీగా చేరుకుని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం, మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు.

రైతులు ప్రధానంగా రెండు డిమాండ్లు ముందుకు తెచ్చారు. ఎలాంటి కొర్రీలు లేకుండా 42 కిలోల తూకంతో వడ్లు తూకం వేయాలని, అలాగే స్పష్టమైన గ్రేడ్ నిర్ణయించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. మిల్లర్ల దౌర్జన్యం నశించాలంటూ, లారీలను తక్షణమే పంపించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని నినాదాలు చేశారు.

ఈ రాస్తారోకో కారణంగా కరీంనగర్-జగిత్యాల రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ బండి రాజేశ్వరి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించారు.

తహసీల్దార్, కరీంనగర్ ఆర్డిఓతో మాట్లాడి రైతుల డిమాండ్లపై స్పందన తీసుకువచ్చారు. 42 కిలోల తూకంతోనే వడ్లు కొనుగోలు చేస్తామని, ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు తమ ధర్నాను విరమించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu