Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramannapet: 64 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Ramannapet: 64 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

hmtv 1 week ago

Ramannapet: 64 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాల చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ "రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి రూ.1,00,116/- ఆర్థిక సాయం అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తుంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల గడప గడపకు చేరేలా కృషి చేస్తున్నాం" అని పేర్కొన్నారు."ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉండకూడదు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఈ పథకం తీసుకొచ్చాం. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బు జమ చేస్తున్నాం" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, pacs చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu