Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramapuram: ఏకిలపల్లిలో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

Ramapuram: ఏకిలపల్లిలో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

hmtv 1 week ago

Ramapuram: ఏకిలపల్లిలో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

ఏకిలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

రామాపురం మండలంలోని ఏకిలపల్లి-చిట్లూరు గ్రామంలో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, గ్రామాల సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి మండల, గ్రామస్థాయి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu