Rampur: జొన్న రైతుల రాస్తారోకో ఎకరానికి 20 క్వింటాళ్లు కొనాలని డిమాండ్
రాంపూర్: యాసంగి లో ఆరుగాలం కష్టపడి పండించిన జొన్న పంట కొనుగోలు లో ప్రభుత్వం కేవలం 10 క్వింటాలుకు పరిమితి ఇవ్వడంపట్ల ఆగ్రహం చెందిన అన్నదాతలు రోడ్డు పై బైఠాయించి ధర్నా,నిరసన వ్యక్తం చేశారు.
బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమం లో పరిసర ప్రాంత రైతులు పాల్గొన్నారు.రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని గొప్పలు పలికిన ప్రభుత్వం మళ్ళీ కోత విధించడం ఏంటని ప్రశ్నించారు.
కోత విధించడం కారణంగా మిగిలిన పంటను విక్రయించేందుకు మధ్య దళారులను ఆశ్రయించి రైతులు మోసపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు పండించిన జొన్న పంట దిగుబడి ఎన్నడు లేనంతగా వచ్చిందని రైతుల శ్రేయస్సు కోరి ప్రభుత్వం ఒక ఎకరానికి 10 క్వింటాల్ కు బదులు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని లేని పక్షంలో తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని రైతులు పేర్కొన్నారుకార్యక్రమం లో రాంపూర్ మాజి సర్పంచ్ రామ్ నారాయణ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

