Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rapur: కండలేరు జలాశయం క్యాచ్ కెనాల్స్ కూల్చివేతపై బీజేపీ ఫైర్!

Rapur: కండలేరు జలాశయం క్యాచ్ కెనాల్స్ కూల్చివేతపై బీజేపీ ఫైర్!

hmtv 4 days ago

రాపూరు: కండలేరు జలాశయం మట్టికట్టపై జరుగుతున్న పనులు జలాశయం పటిష్టతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తెలిపారు, జలాశయం రక్షణ కొరకు మట్టి కట్టపై ఏర్పాటు చేసి ఉన్న క్యాచ్ కెనాల్సును ఎందుకు కూల్చాల్సి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు,జరుగుతున్న పనులను పరిశీలిస్తే జలాశయ పటిష్టత కంటే కాంట్రాక్టర్లు అధికారులు కు ఆదాయ వనరుల కోసమే ఈ పనులు చేస్తున్నట్లు భావిస్తుందన్నారు.

చీఫ్ ఇంజనీర్ ఇన్స్పెక్షన్ నోట్ ఆధారంగా ఈ పనులు కేటాయించారని తెలుస్తుందని, కాసుల కోసం జలాశయం క్యాచ్ కెనాల్స్ పగల కొట్టేందుకు అనుమతించిన అధికారుల పై కూడా పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు,నిధుల దుర్వినియోగమే కాకుండా జలాశయం మట్టి కట్ట దెబ్బతినేలా జరుగుతున్న పనులపై జలాశయ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి, ముడమాల రమేష్ రెడ్డి. చింత గింజల సుబ్రమణ్యం, రాచపూటి ధనంజయరావ్, వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu