Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Razole: రాజోలులో కాలువ అభివృద్ధి పనులు

Razole: రాజోలులో కాలువ అభివృద్ధి పనులు

hmtv 2 weeks ago

Razole: రాజోలులో కాలువ అభివృద్ధి పనులు

రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కూనవరం గ్రామంలో సుమారు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన కాలువ అభివృద్ధి పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇంచార్జి గొల్లపల్లి అమూల్య సోమవారం పరిశీలించారు.

గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతిని స్థానిక ప్రజలు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఆమె క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం,వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా పంట కాలువల పూడికతీత, కాలువల విస్తరణ, రక్షణ గోడల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు వంటి పనులను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.

కూనవరం పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు నీటి సరఫరా మెరుగుపడేలా ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సజావుగా సాగి రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా పంటలకు నష్టం జరగకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అమూల్య అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని తెలిపారు.

గ్రామ ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ రంగ బలోపేతం, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుసూరి సునీత రామ పురుషోత్తం, కార్యదర్శి ఆరుమిల్లి భాను, చెల్లింగి జానకిరామయ్య, ముగ్గు పెద్దిరాజు, గుబ్బల వెంకటేశ్వరరావు, కాండ్రేగుల మణిబాబు, గుబ్బల దుర్గాప్రసాద్, చెల్లింగి నాగన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu